అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అనాథ విద్యార్థుల పేర్లు "తల్లి వందనం" అర్హుల జాబితాలో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో తాత నాగమల్లప్ప సంరక్షణలో చదువుకుంటున్నామని, అధికారులు స్పందించి పథకం లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను వేడుకున్నారు.
వార్తలు
తల్లిదండ్రులు లేని పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి


