హైదరాబాద్: 28°C
భక్తి

విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు

ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశిని మొదటి పండుగగా ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఇవాళ్టి నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం, యాలకులు కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.