హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. నిన్న స్వామివారిని 78,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,018 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.