మహబూబ్‌నగర్ పట్టణంలోని 40వ డివిజన్‌లో స్థానికుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే నగర పాలక సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ సీబీ పూజిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
వార్తలు
హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన నగర మేయర్


