హైదరాబాద్: 28°C
వార్తలు

గోదావరిఖని ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నిన్న గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ఆసుపత్రిలో లభించే సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డా. హిమబిందు సింగ్ వెంట ఉన్నారు.