GNTR: ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడులో 8 గ్రామాల ప్రజల 24 ఏళ్ల కల నెరవేరనుంది. నడింపాలెం హైవే నుంచి మేడవారిపాలెం వరకు రూ.12 కోట్లతో నిర్మించే 20 కి.మీల రోడ్డు పనులకు ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలు, రైతుల రవాణా కష్టాలు శాశ్వతంగా తొలగిస్తామన్నారు.
వార్తలు
24 ఏళ్ల రోడ్డు కష్టాలకు చెక్!


