SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై బోటింగ్ సేవలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. సాయంత్రం వేళ కుటుంబాలతో విహారానికి వచ్చే సందర్శకులు బోటింగ్ అందుబాటులో లేక నిరాశ చెందుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. బోటింగ్ ను తిరిగి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
వార్తలు
చెరువు కట్టపై నిరుపయోగంగా బోటింగ్


