హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తొలి ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వరస్వామికి మహాభిషేకం

వరంగల్ రామన్నపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి 108 కళశాలు, 108 లీటర్ల ఆవుపాలతో మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.