హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి'

ప్రకాశం: దర్శి కృషి విజ్ఞాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కురిచేడు(M) దేకనకొండ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సూపర్ ఎల్‌నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని డాక్టర్ రమేశ్ సూచించారు. కంది, మినుము, సజ్జ, బొబ్బర్లు సాగు చేసుకోవాలని చెప్పారు. పత్తి, బత్తాయి పంటలు పరిశీలించి, పలు జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో సంపత్ కుమార్, రైతులు పాల్గొన్నారు.