హైదరాబాద్: 28°C
వార్తలు

పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు లోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు రహమత్ అలీ ఖాన్, మురళీకృష్ణ కంటి సమస్యలతో వచ్చిన రోగులను పరీక్షించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. తర్వాత కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శిబిరం నిర్వాహకులు మునస్వామి మొదలియా తదితరులు పాల్గొన్నారు.