హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత జూడో ప్లేయర్‌పై సస్పెన్షన్ వేటు

భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రజత విజేత తులిక మాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ సస్పెన్షన్ వేటు వేసింది. గత 12 నెలల్లో మూడుసార్లు తన 'వేర్ అబౌట్స్' వివరాలు ఇవ్వడంలో విఫలమవడంతో ఈ చర్యలు తీసుకుంది. దీంతో భారత జూడో జట్టు నుంచి ఆమె పేరును తొలగించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు తులిక దూరమైంది.