హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం: వైద్య విద్యార్థిని ఆత్మహత్య

TG: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో పీజీ ఆప్తమాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని దీక్షిత (26) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.