హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: ఐదుగురు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేంకానాల్ జిల్లాలో పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.