హైదరాబాద్: 28°C
వార్తలు

తాడిపత్రిలో జేసీ అస్మిత్, ప్రభాకర్ రెడ్డితో భేటీ

ATP: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిశారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి యంత్రాంగం చురుకుదనం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు.