మహారాష్ట్ర ఠాణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సునీతాదేవి అనే మహిళ తన భర్త హరేరామ్ సింగ్(35) ఎన్నిసార్లు అడిగినా చీరలు కొనివ్వడం లేదనే కోపంతో కుక్కర్ మూతతో దాడి చేసింది. అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. ప్రమాదవశాత్తు తన భర్త చనిపోయాడని నమ్మించేందుకు యత్నించగా.. పోస్టుమార్టం నివేదికలో నిజం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్
దారుణం.. భార్యకు చీరలు కొనివ్వలేదని!


