హైదరాబాద్: 28°C
వార్తలు

కసాపురం ఆలయంలో వరుణయగ మహోత్సవం

GTL: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం వరుణ యాగమహోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో విజయరాజు మాట్లాడుతూ.. నేటి నుంచి ఈనెల 25 వరకు ఈ పూజలు జరుగుతాయన్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.