హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీస్‌లో భారత స్మిమ్మర్ శ్రీహరి నటరాజ్

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్మిమ్మర్ శ్రీహరి నటరాజ్ సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఇవాళ జరిగిన పోటీలో శ్రీహరి 25.52 సెకన్లలో రేసును పూర్తి చేసి సంయుక్తంగా 14వ స్థానంలో నిలిచాడు. బెర్ముడాకు చెందిన హార్వేతో సమాన సమయాన్ని నమోదు చేసి టాప్-16లో చోటు దక్కించుకుని సెమీస్‌కు చేరుకున్నాడు.