హైదరాబాద్: 28°C
వార్తలు

మద్యం షాపుల తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

PLD: బొల్లాపల్లి మండలంలోని మూడు మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం విక్రయాలను ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్’ ద్వారా స్కాన్ చేసి చేయాలని, ఎంఆర్‌పీ ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. నాటుసారా, గంజాయి, కల్తీ కల్లు సమాచారం ఉంటే తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డీ. వెంకటేశ్వర్లు తెలిపారు.