హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన అధ్యాపకుల శిక్షణ

SKLM: టెక్కలి సమీప ఐతం కళాశాలలో కృత్రిమ మేధస్సుపై ఐదు రోజుల అధ్యాపక శిక్షణ శుక్రవారం ముగిసింది. ఎన్‌ఐటిటిటిఆర్, చండీగఢ్ ఆధ్వర్యంలో, ఇంటెల్ సహకారంతో జులై 20-24 వరకు జరిగిన ఈ శిక్షణలో దేశవ్యాప్తంగా అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరేటివ్ ఏఐ, బోధనలో ఏఐ వినియోగంపై నిపుణులు అవగాహన కల్పించారు.