హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీహెచ్‌లో బేబీ కిట్ల పంపిణీ

విశాఖ కేజీహెచ్ శిశు విభాగాధిపతి (HOD) డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూ శిశువుల తల్లులకు 100 బేబీ ఎసెన్షియల్ కిట్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ సౌజన్యంతో ఈ కిట్లు అందజేశారు. ఈ సహాయం కోరిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేస్తామని రోటరీ క్లబ్ హామీ ఇచ్చింది.