హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన బట్లర్

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జోస్ బట్లర్ (14,572) వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్ గేల్ (14,562) రికార్డును అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేసి బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.