హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంతకంటే సంతోషంగా ఉండలేను: శ్రేయస్

జింబాబ్వే పర్యటనలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌గా తొలి విజయం సాధించడంతో శ్రేయస్ స్పందించాడు. 'ఇంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. కెప్టెన్‌గా నా మొదటి విజయం అందుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది' అని చెప్పుకొచ్చాడు.