హైదరాబాద్: 28°C
క్రీడలు

చైనా ఓపెన్‌: సింధుకు షాక్

చైనా ఓపెన్‌లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. రెండో రౌండ్‌లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో 21-16, 20-22, 18-21 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్ గెలిచిన సింధు.. రెండో సెట్‌లో 20-16తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచింది. ఈ సమయంలో తడబడిన సింధు ప్రత్యర్థికి సెట్‌ను కొల్పోయింది. చివరి సెట్‌లోనూ ఒత్తిడికి లోనై ఓటమి చవిచూసింది.