హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిజం సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు ముగింపు

KNR: స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్సు ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 28వ బ్యాచ్‌కు సంబంధించిన పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు నెలల పాటు నిర్వహించిన ఈ కోర్సులో భాగంగా రెండు రోజుల పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు కోర్సు కోఆర్డినేటర్, తెలుగు విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.