హైదరాబాద్: 28°C
క్రీడలు

అఫ్గానిస్తాన్ టెస్టు, వన్డే కెప్టెన్‌గా రహ్మత్

అఫ్గానిస్తాన్ టెస్టు, వన్డే కెప్టెన్‌గా రహ్మత్ షా నియమితుడయ్యాడు. రహ్మనుల్లా గుర్బాజ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రహ్మత్ వైస్ కెప్టెన్‌గా 2021 నుంచి టెస్టులు, వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. అతడి అనుభవం, ఆటపై అవగాహన అఫ్గాన్ మరిన్ని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఉన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.