NLG: పెద్ద అడిశర్లపల్లి మండలం మునవత్ తండాలో గురువారం 'సర్' ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సభకు దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత హాజరయ్యారు. ఓటరు నమోదు పారదర్శకంగా చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'బీఎల్ఏ' లు బాధ్యతగా పనిచేయాలి'


