హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

MDK: మనోహరాబాద్ 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తూప్రాన్ డీఈ గరుత్మంత్ రాజ్ తెలిపారు. మనోహరాబాద్, తూప్రాన్, శివంపేట, మాసాయిపేట మండలాల పరిధిలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొంటూ వినియోగదారులు సహకరించాలని కోరారు.