హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ గ్రామంలో మద్యపాన నిషేధం

SDPT: వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మహిళల విజ్ఞప్తితో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం గ్రామంలో మద్యం విక్రయించినా, నిషేధాన్ని ఉల్లంఘించినా రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. కుటుంబాల సంక్షేమం, యువత భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.