హైదరాబాద్: 28°C
వార్తలు

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

GDWL: జిల్లా జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుధ్య లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మరుగుదొడ్లు, విద్యుత్ పనులకు మంజూరైన రూ.50 లక్షల నిధులతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. విధులకు హాజరు కాని వైద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.