హైదరాబాద్: 28°C
వార్తలు

'రెండు రోజుల ముందుగానే పింఛన్లు'

VZM: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జూలై 30న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. విజయనగరం జిల్లాలోని లబ్ధిదారులకు కూడా ఆరోజే పెన్షన్లు అందనున్నాయని పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభంకానుందన్నారు.