హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో స్పెషల్ వెహికల్ చెకింగ్

GNTR: తెనాలి ప్రకాశంరోడ్డులోని స్థూపం సెంటర్ వద్ద గురువారం సాయంత్రం టూ టౌన్ సీఐ రవీంద్రబాబు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ సూచించారు.