ASR: చింతపల్లి ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 3లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వై.రామ్మోహనరావు తెలిపారు. దరఖాస్తు అనంతరం ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. అర్హులైన వారికి ఆగస్టు 6న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
ఆగస్టు 3 వరకు దరఖాస్తులు


