VSP: ఈ నెల 28న జరిగే సింహాచలం గిరిప్రదక్షిణను పురస్కరించుకుని స్వామివారి ప్రచార రథానికి గురువారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆలయ ఈవో జె.వెంకటరావు, ఈఈ బి.రాంబాబు నేతృత్వంలో రథాన్ని తొలి పావంచ నుంచి గిరిప్రదక్షిణ మార్గంలో నడిపి రోడ్డు పరిస్థితులు, మలుపులను పరిశీలించారు. గిరిప్రదక్షిణలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
ప్రచార రథం ట్రయల్ రన్


