హైదరాబాద్: 28°C
వార్తలు

బెజ్జంకి యువకుడికి పీహెచ్‌డీ

SDPT: బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన బోనాల అనిల్ శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా సాధించారు. ‘తెలంగాణలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు- తులనాత్మక అధ్యయనం’ అంశంపై డా. డి. హరికాంత్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి వైవా-వోసేలో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు.