హైదరాబాద్: 28°C
క్రీడలు

MI కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ..?

'ది హండ్రెడ్ 2026' టోర్నీలో MI లండన్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీతో కలిసి రోహిత్ శర్మ వీక్షించడం చర్చనీయాంశమైంది. వన్డే సిరీస్ ముగిసినా లండన్‌లోనే ఉన్న రోహిత్‌ను మళ్లీ MI కెప్టెన్‌గా నియమిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. హార్దిక్ సారథ్యంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కానీ.. MI యాజమాన్యం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.