హైదరాబాద్: 28°C
వార్తలు

'వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి'

SKLM: అమెరికా-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కాశీబుగ్గలో ధర్నా నిర్వహించిన నాయకులు, ఈ ఒప్పందంతో రైతులు, కార్మికులు నష్టపోతారని ఆరోపించారు. విదేశీ పంటల దిగుమతితో గిట్టుబాటు ధర లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఒప్పందం రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.