హైదరాబాద్: 28°C
వార్తలు

'భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి'

BPT: భూ సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో 22ఎ, ఎస్ఇఆర్, పాస్‌పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీపై సమీక్ష నిర్వహించారు. రీ-సర్వే పూర్తి చేసి పాస్‌పుస్తకాలు ఇవ్వాలని, ఎస్ఇఆర్‌లోని డూప్లికేట్, షిఫ్టింగ్ నమోదులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.