హైదరాబాద్: 28°C
వార్తలు

గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కనిగిరి పట్టణంలో టవర్ వర్క్ కారణంగా గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పామూరు బస్టాండ్‌ నుంచి వెన్నెల అపార్ట్‌మెంట్‌ వరకు ఇరువైపులా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.