హైదరాబాద్: 28°C
క్రీడలు

స్వదేశానికి లలిత్‌ మోదీ!  

ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ 16 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు రానున్నాడు. 2009 నాటి ఫెమా కేసులో అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ ఊరటనివ్వడంతో, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశానికి వస్తానని తెలిపాడు. ట్రైబ్యూనల్‌ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటానికి ముగింపు పడిందని, సత్యమే గెలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.