హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆర్ధిక దోపిడీకి గురవుతున్న కార్మికులు'

ASR: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్లు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని, వారికి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్ కోరారు. కార్మికుల సమస్యలపై ఈనెల 30, 31వ తేదీల్లో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడున్నామన్నారు. బుధవారం చింతపల్లిలో ప్రజా సంఘాల సమన్వయ కమిటీ మండల కార్యదర్శితో కలిసి ధర్నా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.