SKLM: పంట నష్టాల నుంచి రక్షణకు రైతులు ఆగస్టు 15లోపు పంటల బీమాను నమోదు చేసుకోవాలని మెలియాపుట్టి మండల ఏవో ఎస్. దానకర్ణుడు బుధవారం తెలిపారు. మెలియాపుట్టి మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వరి సాగు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రుణ రైతులు బ్యాంకుల్లో, ఇతరులు మీసేవలో ప్రీమియం చెల్లించాలని సూచించారు.
వార్తలు
'గడువులోగా నమోదు చేసుకోవాలి'


