హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆధ్యాత్మిక సేవలో కోహ్లీ దంపతులు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లిన ఈ దంపతులు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కోహ్లీ జంట, కొంతసేపు ఆధ్యాత్మిక చింతనలో గడిపింది. వీరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు SMలో వైరల్ అవుతున్నాయి.