NZB: నందిపేట్ మండలం తల్వేదలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బుధవారం సర్పంచ్ గడసంద హరిత శ్రీకాంత్ భూమిపూజ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ నిర్మాణాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగయ్య, గంగారెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ


