హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలపై టీడీపీ దృష్టి.. డోర్ టు డోర్‌కు పిలుపు

కృష్ణా: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పెడన నియోజకవర్గ పరిశీలకులు షేక్ ఆషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, వార్డులో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. డోర్ టు డోర్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.