హైదరాబాద్: 28°C
వార్తలు

జుజ్జూరులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో జూలై 24న (శుక్రవారం) ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అల్లూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పి. సుకన్య (MD-Ayu) తెలిపారు. సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేద మందులు అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.