హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం పోలీసులకు ఉండాలి'

ADB: ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం పోలీసులకు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సంబంధిత సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం, క్రమశిక్షణ, నిజాయితీ తప్పనిసరని ఉండాలని అన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.