హైదరాబాద్: 28°C
క్రీడలు

పూరన్ ఊచకోతకు బౌలర్లు బలి

'ది హండ్రెడ్ 2026' లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ 'MI లండన్' శుభారంభం చేసింది. కెనింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లండన్ బ్యాటర్ నికోలస్ పూరన్ 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేసి సన్‌రైజర్స్ బౌలర్లను దెబ్బతీశాడు. దీంతో 144 పరుగుల లక్ష్యాన్ని MI 84 బంతుల్లోనే ఛేదించింది.