హైదరాబాద్: 28°C
వార్తలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NZB: ధర్పల్లి మండలంలోని హొన్నాజి‌పేట్ పాఠశాల 1998-99 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. 27 ఏళ్ల తర్వాత ఇలా అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉందని, ఆటపాటలతో రోజంతా ఆనందంగా గడిపినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.