హైదరాబాద్: 28°C
క్రైమ్

పేలిన సెల్‌ఫోన్.. బాలుడు మృతి

TG: ఆసిఫాబాద్ జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా అది ఒక్కసారిగా పేలడంతో లోకేష్ (14) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.