TG: కరీంనగర్ భగత్‌నగర్‌లో భారీ దోపిడీ జరిగింది. అజ్మత్ అలీ ఇంట్లో ఐదుగురు దుండగులు హల్‌చల్ చేశారు. కుటుంబాన్ని కట్టేసి తుపాకీతో బెదిరించిన దుండగులు.. 60 తులాల బంగారం, రూ.20 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో పార్క్ చేసిన 2 బైకులను దొంగలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
దొంగల హల్‌చల్.. 60 తులాల బంగారం చోరీ


